కూటమికి సినీనటుడు సుమన్ మద్దతు - గద్దె రామ్మోహన్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు - Suman Supports to Gadde rammohan - SUMAN SUPPORTS TO GADDE RAMMOHAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 9:49 PM IST

Cine Actor Suman Supports to Vijayawada East MLA Candidate Gadde Rammohan : రాష్ట్రంలో ప్రచారానికి ఒక రోజు సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. కూటమి నేతలకు ప్రజాల నుంచి విశేషంగా మద్దతు లభిస్తోంది. ఓటర్లను పసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి పట్ల తమ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో కూటమి అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. కూటమి మేనిఫెస్టో, తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ప్రజలకు భరోసానిస్తున్నారు. అలాగే కొంత మంది సినీనటులు సైతం కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 

తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్​కు సినీనటుడు సుమన్ మద్దతు ప్రకటించారు. తన మంచి మిత్రుడైన గద్దె రామ్మోహన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయగా రేపు(శనివారం) సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.