LIVE: జగన్పై గులకరాయిదాడితో వైసీపీ చీప్ రాజకీయం - చింతమనేని మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - Chintamaneni on YCP cheap politics - CHINTAMANENI ON YCP CHEAP POLITICS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-04-2024/640-480-21227540-thumbnail-16x9-chintamaneni-on-ycp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 12:16 PM IST
|Updated : Apr 15, 2024, 12:35 PM IST
Chintamaneni Prabhakar media conference on YCP cheap politics live: రాష్ట్ర ప్రజలు జగన్ ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుసు కాబట్టే జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజల్ని భ్రమలో పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఐదు సంవత్సరాల క్రితం కోడికత్తి డ్రామా ఆడాడని ఆరోపిస్తున్నారు. తాజాగా రాయి డ్రామా ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా రాయి తగిలి కింద పడుతుంది గానీ, పక్కవాడికి కూడా తగలడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేసింది వీడే అని ఒక అమాయకుడిని చూపించి, అతన్ని కోడికత్తి శీనులా జైల్లో మగ్గబెడతారని ధ్వజమెత్తారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సీఎం ప్రచారంలో కరెంటు పోతే కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటారని, కరెంట్ పోతే ప్రచారం ఆపేసి సీఎం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. కానీ అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
Last Updated : Apr 15, 2024, 12:35 PM IST