అన్న క్యాంటీన్ పునరుద్ధరించటంపై ప్రజలు సంతోషం - టీడీపీ పేదవాడి ఆకలి తీరుస్తుందంటున్న అభిమానులు - Chandrababu Sign on Anna Canteen - CHANDRABABU SIGN ON ANNA CANTEEN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 10:23 PM IST
Chandrababu Sign On Reopen Anna Canteen: పేదవాడి ఆకలి తీర్చేది తమ ప్రభుత్వమేనని టీడీపీ అభిమానులు అంటున్నారు. అన్న క్యాంటీన్‌లను పునరుద్ధరించటంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్లను, తిరిగి పేదవాడి ఆకలి తీర్చేందుకు మళ్లీ పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేయడంపై బాపట్ల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పేదల ఆకలి తీర్చడాన్ని ఓర్చుకోలేకపోయిన జగన్ అన్న క్యాంటీన్లను మూసివేశారని వారు మండిపడ్డారు.
Bapatla People Happy in Anna Canteen Reopen: కార్మికులు, రోజువారీ పనులు చేసుకునే కూలీలకు తెలుగుదేశం హయాంలో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించిన విషయాన్ని స్థానికులు గుర్తు చేసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా వ్యవహరించి అన్న క్యాంటీన్లను మూసేసి నిరుపేదల నోటి దగ్గర ముద్ద తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్లకు మళ్లీ పూర్వ వైభవం కల్పించాలని ప్రజలు కోరారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, బాధ్యతలు తీసుకున్న తొలి రోజే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.