దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు: చంద్రబాబు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 10:40 PM IST

Chandrababu Released Aksharastram Book: ప్రజాచైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా సంస్థలు, జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకం ప్రజలను ఆలోచింపచేసేలా ఉందన్నారు. వైసీపీ నేతల అరాచాకలు, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రసాద్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ కల్యాణ్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు ఫిబ్రవరి 15న విజయవాడలో నిర్వహించనున్న ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకాన్ని నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్​లో ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా తొలి ప్రతిని పవన్ అందుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ఆలపాటి సురేష్ కుమార్ పుస్తకంలో పొందుపరిచారు. మొత్తం 185 అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.