Live నందికొట్కూరు ప్రజాగళంలో చంద్రబాబు- ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam Meeting - CHANDRABABU PRAJAGALAM MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 7:41 PM IST
|Updated : Apr 29, 2024, 9:01 PM IST
Chandrababu Prajagalam Live: నంద్యాల జిల్లా నందికొట్కూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెుదట నిరుద్యోగ సమస్యలపై దృష్టి పెడతామన్నారు. వైసీపీ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక పంఛన్ విషయంపై స్పందించిన చంద్రబాబు... పింఛన్ వ్యవహారంపై తాము గవర్నర్ వద్దకు వెళ్లే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పించారు, ఇవాళేమో బ్యాంకుల చుట్టూ తిప్పిస్తున్నారు, బ్యాంకుల్లో నగదు జమ చేస్తే తీవ్రమైన ఎండ వేడిమిలో పింఛన్ కోసం ఎలా వెళ్తారు ? అని ప్రశ్నించారు. అవసరానికి డబ్బులు రాకుండా చేస్తున్నారని, మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా? అని అధికారులని నిలదీశారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ సిబ్బందితో పంచాలని, అంతే తప్ప కుంటి సాకులతో వృద్ధులను ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు.
Last Updated : Apr 29, 2024, 9:01 PM IST