LIVE అమలాపురం ప్రజాగళం భహిరంగ సభలో చంద్రబాబు, పవన్కళ్యాణ్- ప్రత్యక్ష ప్రసారం - AMP CBN PAVAN in Amalapuram live - AMP CBN PAVAN IN AMALAPURAM LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 8:46 PM IST
|Updated : Apr 11, 2024, 9:57 PM IST
Chandrababu Pawan Joint Campaign live From Amalapuram : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూకుడు పెంచింది. ఎన్డీఏలో ఆయా నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సభ తప్ప మూడు పార్టీ నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభల్లో ఒకే వేదికను పంచుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం నుంచి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అధినేతలు కలసి ఉమ్మడిగా రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొంటున్నారు. ప్రజాగళం మూడో విడతలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి బుధవారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని నిడదవోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు, పవన్ కలిసి ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో వారాహి విజయ భేరి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 11, 2024, 9:57 PM IST