'ఉద్యోగాల పేరుతో యువత అక్రమ రవాణా బాధాకరం'- మాణిక్యాలరావుకు అండగా చంద్రబాబు - Cbn on Human Trafficking
🎬 Watch Now: Feature Video
Chandrababu Naidu on Human Trafficking : మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న 150 మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను ఎక్స్ ద్వారా కోరారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లగుంట గ్రామంలోని పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న నోముల మాణిక్యాలరావుతో చంద్రబాబు శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయనకు ధైర్యం చెప్పారు. పోలింగ్ రోజున కండ్లగుంటలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని మాణిక్యలరావు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వెంకట్రామిరెడ్డి. తన అనుచరులతో కలిసి మాణిక్యాలరావు ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అతడినీ చంపేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన మాణిక్యాలరావు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు.