మా బంగారం మాకు ఇచ్చేయండి - చైతన్య గోదావరి బ్యాంక్​ ముందు బాధితుల ఆందోళన - Chaitanya Bank gold cheating

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 3:23 PM IST

Chaitanya Godavari Bank Customers Concern at Dodleru Branch : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి బ్యాంకులో బంగారం గోల్​మాల్​పై బాధితులు అందోళనకు (Protest) దిగారు. తాము తనఖా పెట్టిన బంగారాన్ని అప్పగించాలని అధికారులను బాధితులు నిలదీశారు. నెలలు గడుస్తున్నా న్యాయం జరగటం లేదంటూ ఉద్యోగులను (Employees) అడ్డుకున్నారు. పోయిన బంగారాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

"320 అకౌంట్లకు సంబంధించి రైతులపేర్లు మేనేజరు తెలియజేశారు. ఈ లిస్ట్​లో పేర్లు మిస్ అయిన వారి అకౌంట్ల గురించి , మిస్సింగ్ బంగారం గురించి  వెరిఫికేషన్ చేస్తామన్నారు. ఆగస్టు 19వ తేదీ నుంచి మార్చి 28 వరకూ గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మెుత్తం 500 మందికి న్యాయం చేయాలని రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం." - తిమ్మిశెట్టి హనుమంతరావు, రైతు సంఘం నాయకుడు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.