తక్కువ ధరకే నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్- 50 లక్షల కనెక్షన్ల టార్గెట్ : జీవీ రెడ్డి - GV REDDY ON AP FIBERNET
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-12-2024/640-480-23017981-thumbnail-16x9-ap-fibernet-chairman-gv-reddy.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2024, 2:21 PM IST
GV Reddy on AP FiberNet : పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ నెట్‌వర్క్‌తో పాటు ఫోన్ కాల్స్ అందించడమే లక్ష్యంగా ఏపీ ఫైబర్‌నెట్‌ను ఏర్పాటు చేసినట్లు ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. కానీ గత సర్కార్ దీనిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజలకు అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంటర్నెట్ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా రానున్న రోజుల్లో 50 లక్షల నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ నెట్‌వర్క్‌ల కన్నా నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నెట్వర్క్ సమస్యలు, సెటప్ బాక్స్ సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేలా సర్వీస్ సెంటర్లని ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీటీడీ సంస్థలకు ఫైబర్‌నెట్ సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రితో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి వెల్లడించారు.