ఎన్నికల ప్రచారాలు, ప్రసంగాలు అలా ఉండాలి - లేదంటే ఈసీ చూస్తూ ఊరుకోదు : వికాస్‌రాజ్ - CEO Vikas Raj Interview - CEO VIKAS RAJ INTERVIEW
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21184296-thumbnail-16x9-ceo-vikas-raj-interview.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 9, 2024, 7:48 PM IST
CEO Vikas Raj Interview 2024 : ఎన్నికలంటేనే ప్రధానంగా గుర్తుకు వచ్చేది ప్రచారాలు, సభలు, ర్యాలీలు, రోడ్ షోలు. సాధారణ సమయాల్లో ఇవన్నీ చేసినా అంతగా పట్టించుకోరు కానీ, ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయ పార్టీలు ఏదీ చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను తూ.చా. తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే వారిపై వేటు పడే అవకాశముంటుంది. రాజకీయ పార్టీలు కొన్ని నియమాలు పాటిస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయి అంటున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రచారం చేసుకోవచ్చని అంటున్నారు. ఎన్నికల ప్రచారాలు, ప్రసంగాలు ఎలాంటి ప్రలోభాలకు దారి తీయకుండా ఉండాలని సూచించారు. మరోవైపు పారదర్శక ఎన్నికల కోసం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని తెలిపారు. మరి ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎలాంటి జాగ్రత్తలు, నియమాలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయవచ్చో ఆయన మాటల్లోనే విందాం.