భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ - SRINIVASA VARMA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 7:29 PM IST
Central Minister Srinivasa Varma Visit Mavullamma Temple: భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రిగా మరో రెండు రోజుల్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు వేదాశీర్వచనాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి దయవల్లే కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగానని వర్మ వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస వర్మ టీడీపీ, జనసేన మద్దతుతో అనూహ్య విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాబాలపై శ్రీనివాస వర్మ 2,76,802 ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో ఆయనకు మోదీ కేబీనెట్లో అవకాశం దక్కింది. మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్రమంత్రులుగా ఎంపిక చేసిన వారిని రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. దీంతో మరో రెండు రోజుల్లో శ్రీనివాస వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.