చిన్న వయసులోనే గుండెపోటుకు కారణాలేంటి? - డాక్టర్ రమేష్ బాబు ఇంటర్వ్యూ - Cardiologist ramesh Babu interview
🎬 Watch Now: Feature Video
Dr Ramesh Babu on Heart Attacks In Youngsters: హృదయ రక్తనాళాల్లో కొవ్వు చేరటం వల్ల అధికంగా గుండె సమస్యలు వస్తున్నాయని ప్రముఖ గుండెవైద్య నిపుణులు డాక్టర్ పి.రమేష్ బాబు చెప్పారు. కృత్రిమ మేధ పరిజ్ఞానం ద్వారా గుండెపోటును ముందే గుర్తించవచ్చని గుండె వైద్యనిపుణులు చెబుతున్నారు. గుండెలో 40 శాతం బ్లాక్స్ ఉన్నా హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారని చెబుతున్నారు. 20 యేళ్ల యువకులు గుండెపోటుతో ప్రాణాలను కోల్పోతున్నారు. అసలు చిన్న వయసులోనే గుండెపోటుకు కారణాలేంటి. కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉన్నా గుండెపోటు ఎందుకు వస్తుంది. 40 శాతం బ్లాక్స్‌కే ఆకస్మిక మరణాలు ఎందుకు వస్తున్నాయి. 'స్టాటిన్' మాత్రలు ఎవరు వేసుకోవాలి? 'స్టాటిన్' మాత్రలు ఎప్పుడు వాడితే గుండెకు ముప్పు తప్పుతుంది. ఇలా అనేక విషయాలను డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. గుండెపోటుకు గురైన వారిని గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకువస్తే ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్న ప్రముఖ గుండె వైద్యులు డా.పి రమేష్ బాబుతో మా ప్రతినిధి ముఖాముఖి.