మద్యం మత్తులో బీభత్సం- పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, తండ్రీకొడుకు మృతి - పాదచారులపై దూసుకెళ్లిన కారు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 3:21 PM IST
Car Rammed into Pedestrian Several Dead: శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి చెందారు. కర్ణాటక కొడిగినహళ్లి వైపు నుంచి హిందూపురం వైపు వెళ్తున్న కారు.. పరిగి మండలం బిందు నగర్ వద్ద బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆస‌్పత్రికి తరలించారు.
Road Accident Several Dead: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు స్వామి(60) రాజేంద్ర(35) అనే తండ్రీకొడుకు మృతి చెందారు. మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వారి బంధువులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాదచారులను ఢీ కొట్టిన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారంతా పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ప్రమా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.