కారులో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - Hyderabad Car Fire Accident
🎬 Watch Now: Feature Video


Published : Mar 6, 2024, 3:59 PM IST
Car Fire Accident In Hyderabad : హైదరాబాద్‌లో వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accident) ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్డీకపూల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెట్రల్ పోయించడానికి బంకులోకి వచ్చిన సమయంలో కారులో నుంచి పొగలు వచ్చాయి. ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది కారును రోడ్డు పక్కకు నెట్టేశారు. కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే పూర్తిగా దగ్దమైంది. పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కారు పూర్తిగా అగ్నికీలల్లో దగ్ధమైపోయింది. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. వేసవిలో వైరింగ్ సమస్య వల్ల వేడికి కారులో సాధారణంగానే మంటలు ఏర్పడుతుంటాయి.