LIVE: నూతన మద్యం విధానం - మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Cabinet Meeting on Liquor Policy - CABINET MEETING ON LIQUOR POLICY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 3:05 PM IST

Updated : Sep 17, 2024, 3:37 PM IST

Cabinet Sub Committee Meeting with CM on Liquor Policy Live: రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. కొత్త మద్యం విధానంపై తమ అభిప్రాయాన్ని  మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి వివరించింది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం విధానాలను కూడా ఎక్సైజు శాఖ ఉన్నతాధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రేపు క్యాబినెట్ సమావేశంలోనూ కొత్త మద్యం విధానంపై చర్చించిన నిర్ణయం తీసుకున్న అనంతరం రాష్ట్రంలో అమలు కోసం దాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్‌ రిఫండబుల్‌ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపైన అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించింది. క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం ముందు ప్రతిపాదనలు ఉంచాలని, ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
Last Updated : Sep 17, 2024, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.