LIVE : తెలంగాణ భవన్లో బీఆర్‌ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Press Meet Live - BRS PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-08-2024/640-480-22101480-thumbnail-16x9-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 1, 2024, 3:06 PM IST
|Updated : Aug 1, 2024, 3:47 PM IST
BRS Press Meet Live : అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇతర నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తమ పార్టీ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. శాసనసభను కాంగ్రెస్ ప్రభుత్వం కౌరవసభలా నిర్వహిస్తోందని మండిపడ్డారు. ఎప్పటికైనా గెలిచేది పాండవులేనని, నిలిచేది ధర్మమేనని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పేవరకు సీఎం ఛాంబర్ ముందే కూర్చుంటామని ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు బయటకు పంపారు.
Last Updated : Aug 1, 2024, 3:47 PM IST