LIVE : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ - BRS CELEBRATES TG FORMATION DAY - BRS CELEBRATES TG FORMATION DAY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-06-2024/640-480-21615296-thumbnail-16x9-brs.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 2, 2024, 9:53 AM IST
|Updated : Jun 2, 2024, 12:47 PM IST
BRS Celebrate TG Formation Day 2024 : తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను సాధించి తొలి ప్రభుత్వం ఏర్పాటుచేసి, ప్రజల సహకారంతో దశాబ్ద కాలంపాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజాసంక్షేమ పాలన స్ఫూర్తి అందుకొని ముందుకు సాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థంగా పాలన అందించిన పదేళ్ల స్వయంపాలనకాలం దేశానికి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా నిలిపిందని వివరిస్తున్నారు. వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తున్నారు.
Last Updated : Jun 2, 2024, 12:47 PM IST