వరదబాధితులను ఆదుకునేందుకు వెళ్లి గల్లంతైయ్యాడు- కుటుంబానికి అండగా ఉంటామన్న సీఎం - Boat Accident in Konaseema district - BOAT ACCIDENT IN KONASEEMA DISTRICT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 10:35 PM IST
Boat Accident in Konaseema District : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగుపూడి లంకలో పడవ ప్రమాదం జరిగింది. బూరుగుపూడి లంక నుంచి జీ.పెదపూడి లంక, ఊడుమూడి లంక వాసులకు తాగు నీరు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానిక ప్రజలు ఐదుగురు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. అధిక లోడ్‌తో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
చంద్రబాబు ఆర్థిక సహాయం : గోదావరి నదిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
గోదావరి వరద మళ్లీ పుంజుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. కొద్దీ రోజులుగా వరద నీటితోనే సావాసం చేస్తున్న లంక గ్రామాల వాసులు పెరుగుతున్న ప్రవహంతో బిక్కుబిక్కుమంటున్నారు.