పొగాకు అదనపు పంటపై జరిమానా మాఫీ- కేంద్రమంత్రి పీయూష్‌కు కృతజ్ఞతలు తెలిపిన పురందేశ్వరి - PURANDESWARI MEET MINISTER PIYUSH - PURANDESWARI MEET MINISTER PIYUSH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 12:04 PM IST
BJP Purandeswari Meet Union Minister Piyush Goyal: పొగాకు అదనపు పంటపై జరిమానా మాఫీ చేసినందుకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. పొగాకు రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల పొగాకు రైతుల ఇబ్బందులపై కేంద్ర మంత్రికి ఆమె వినతి పత్రం అందజేశారు. రైతులతో సమావేశమైనప్పుడు ఆయన ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకుని ఆ హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందని పురందేశ్వరి అన్నారు.
పీయూష్ గోయల్‌ను పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచినందుకు పొగాకు బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. పొగాకు బోర్డు చట్టం, 1975(4 ఆఫ్ 1975) ద్వారా విధించిన పరిమితులను సడలించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-2024 పంట సీజన్‌లో వేలం కోసం రాష్ట్రంలో పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 14A లోని సెక్షన్ 10సబ్-సెక్షన్(1)తో నమోదిత సాగుదారుల అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు పంట విక్రయించడానికి అనుమతిస్తుందని పేర్కొంది.