LIVE బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కలిసి లోకేశ్ రోడ్ షో- తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం - Lokesh Road Show With JP Nadda - LOKESH ROAD SHOW WITH JP NADDA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 11:19 AM IST

Updated : May 11, 2024, 12:37 PM IST

TDP Leader Lokesh Road Show With JP Nadda Election Campaign in Tirupathi Live: ఏపీ ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో తిరుపతి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో పర్యటించారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి ప్రసాదరా వుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో కలిసి ఉదయం 9 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి అగ్ర నేతలకు తిరుపతి వాసులు ఘన స్వాగతం పలికారు. వీరి పర్యటనను దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. వీరు నిర్వహించిన రోడ్​ షోకు తిరుపతి వాసులతో భారీగా తరలివచ్చారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూటమి నాయకులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. 
Last Updated : May 11, 2024, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.