తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడు రామోజీ రావు : కిషన్‌రెడ్డి - kishan Reddy Condolences to Ramoji Rao - KISHAN REDDY CONDOLENCES TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video


Published : Jun 8, 2024, 9:59 PM IST
Kishan Reddy Condolences to Ramoji Rao : ఈటీవీ-ఈనాడు సంస్థ వ్యవస్థాపకుడు రామోజీరావు అస్తమయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తెలుగు పాత్రికేయ ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడని కొనియాడారు. ఆయన తీర్చిదిద్దిన అనేక మంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్నారని తెలిపారు.
యావత్ దేశం ఒక గొప్ప మహావ్యక్తిని కోల్పోయిందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రామోజీ రావుకు రాజ్యసభలో చోటు కల్పిస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి, ఒక మిషన్ అని వ్యాఖ్యానించారు. కేంద్రం, బీజేపీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. రామోజీ కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతకముందు ఎక్స్‌లోనూ రామోజీరావు అస్తమయం పట్ల కిషన్‌రెడ్డి సంతాపం తెలిపి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.