"అనుమతులు ఇచ్చిన వారిని వదిలేసి, సామాన్య ప్రజల బతుకులను కూల్చడం కరెక్టా?" - BJP MLA Katipally Comments On Hydra
🎬 Watch Now: Feature Video
BJP MLA Venkata Ramana Reddy Comments On Hydra : హైడ్రా ఆలోచన బాగుంది కానీ ఆచరణలో సాధ్యమవడంలేదని బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. హైడ్రా వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు శిఖం భూమా, చెరువు భూమా, బఫర్ జోన్ భూమా అనేవి తెలియవని అవి తెలియకుండానే భూములు కొన్నారని పేర్కొన్నారు. అసలు చెరువు భూముల్లో రియల్టర్లకు అనుమతులు ఎవరిచ్చారని, లే అవుట్ వేయడానికి అనుమతిచ్చిందెవరని ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి, ఏవీ రంగనాథ్‌లు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల తలరాతలు మారడంలేదని వ్యాఖ్యానించారు. హైడ్రా అకొత్తగా సాధించేదేమి లేదని సామన్య ప్రజల బతుకులను కూల్చడం తప్ప అని విమర్శించారు. కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయో అనే విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల బలహీనతతో బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని ఆరోపించారు. హైడ్రాపై మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని, సచివాలయం ముందు వంటవార్పు చేపడతామని హెచ్చరించారు.