పంచభూతాలను దోచుకున్నారు- సానుభూతితో గెలవలనుకుంటున్నారు!: బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ - bhanu prakash reddy comments - BHANU PRAKASH REDDY COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 7:48 PM IST
Bhanu Prakash Reddy Fires on CM YS Jagan: రాష్ట్రంలో ఎన్నికలు వస్తేనే వింతవింత సంఘటనలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ విమర్శించారు. గతంలో కోడి కత్తి దాడి జరిగితే, ఇప్పుడు రాయి దాడి జరగడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దాడి ఎలా జరిగినా, ముఖ్యమంత్రి పైనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డిలకే ఇలా ఎందుకు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. రాయి విసిరారా, విసిరించుకున్నారా అన్నది తేలాల్సిన అవసరముందన్నారు. ఈ దాడికి భద్రతా వైఫల్యమే కారణమని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలెవ్వరూ అమాయకులు కాదని, సానుభూతితో ఎన్నికల్లో గెలవలేరన్నారు. పంచభూతాలను దోచుకున్న జగన్కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని, ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ సీఎం కాదని, ఇంటి గోడలపై స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.