రాష్ట్రంలో దౌర్జన్యాలు, హత్యలు చేయించేది సీఎం జగనే: ఆదినారాయణ రెడ్డి - Adinarayana Fire on YCP Government - ADINARAYANA FIRE ON YCP GOVERNMENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 10:03 AM IST
BJP Leader Adinarayana Reddy Fire on YCP Government: పుష్ప సినిమా మాదిరిగా ఎర్రచందనం స్మగ్లింగ్, దౌర్జన్యాలు, హత్యలు వంటివి సీఎం జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో టీడీపీ- జనసేన- బీజేపీ కార్యకర్తలతో ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జనసేన ఇంఛార్జ్ జగదీష్‌లు సమావేశం నిర్వహించారు. ఎర్రగుంట్లలో తాను చేసిన అభివృద్ధి పనులన్నీ చూసి ఓటెయ్యాలని ఆదినారాయణరెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని కోరారు.
వివేకా హత్య కేసులో నిజం తెలుస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనివ్వకుండా సీఎం జగన్ కాపాడుతున్నారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేక మర్డర్ విషయంలో ఏం జరిగిందో దేవుడికి, చనిపోయిన చిన్నాన్నకు మాత్రమే తెలుసని ప్రొద్దుటూరు సభలో సీఎం అబద్ధాలు చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగకుండా రాక్షస పాలన మాత్రమే సాగిందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభత్వ అరాచక పాలనకు ప్రజలందరూ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.