LIVE: విశాఖలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ- ప్రత్యక్షప్రసారం - BJP Honor Program - BJP HONOR PROGRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 6:57 PM IST
|Updated : Jul 15, 2024, 8:41 PM IST
BJP Honor Program for People Representatives in Visakha Live: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ప్రజాప్రతినిధులకు ఇవాళ అభినందన సభ ఏర్పాటు చేశారు. విశాఖ సాగర్ మాల కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఇటీవలే రాష్ట్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఇంజినీరింగ్ అసిస్టెంట్లు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ప్రతినిధులు తమ సమస్యల గురించి పురందేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లకి పదోన్నతి లేదని, కనీసం టెక్నికల్ పే స్కేల్ అమలు చేసేలా చూడాలని కోరారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తానని పురందేశ్వరి వారికి హామీ ఇచ్చారు. కాగా విశాఖలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 15, 2024, 8:41 PM IST