కేంద్ర ప్రభుత్వ సహకారంతో 'వికసిత ఆంధ్రప్రదేశ్' లక్ష్యం సాకారం : లంకా దినకర్ - BJP leader Lanka Dinakar Press Meet - BJP LEADER LANKA DINAKAR PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2024, 4:49 PM IST
BJP AP state Chief Spokesperson Lanka Dinakar Press Meet : కేంద్ర ప్రభుత్వం కర్నూలు, కడప జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయటం ద్వారా లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తికి, అమరావతి నిర్మాణానికి నిధుల మంజూరుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం ద్వారా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాకారం అవుతుందన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాల రహదారులు, జల, వాయు మార్గాలను దొనకొండ, కనిగిరి పారిశ్రామిక వాడలకు అనుసంధానం చేస్తూ సమ్మిళిత అభివృద్ధి డ్రాఫ్ట్‌ని సీఎం చంద్రబాబునాయుడికి అందించినట్లు చెప్పారు.
అలాగే ఒంగోలు నుంచి నంద్యాల రోడ్డుని రెండు నుంచి నాలుగు వరుసల విస్తరణ, అంతర్భాగంగా ఒంగోలు పశ్చిమ బైపాస్ రోడ్ నిర్మాణం వల్ల పరిశ్రమలకు, ప్రజల రవాణాకు సులభతరం అవుతుందని తెలిపారు. అలాగే రామాయపట్నం, కృష్ణ పట్నం, బందరు పోర్టులకు ఉండే రోడ్డుకు సైతం రైలు సేవలు అనుసంధానం చేయడం రవాణా అవసరాల కోసం సేవలు మరింత సులభతరం అవుతాయన్నారు. దొనకొండ ఎయిర్ స్ట్రీప్ అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వెలిగొండ కోసం కృష్ణ, గోదావరి నీరు మళ్లించాలని వెలిగొండను రామతీర్థం, గుండ్లకమ్మకు అనుసంధానం చెయ్యాలని లంకా దినకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.