జగన్ వెళ్లే దారిలో భరతమాత విగ్రహాన్ని తొలగించిన నాటి అధికారులు- మళ్లీ ప్రతిష్టించేందుకు యత్నిస్తున్న గ్రామస్థులు - Statue Collapse in Tadepalli

🎬 Watch Now: Feature Video

thumbnail

Bharata Mata Statue Collapse in Tadepalli : గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో ఉన్న భరతమాత విగ్రహాన్ని అప్పట్లో ట్రాఫిక్ పేరుతో తొలగించారు. అక్కడి నుంచి పురపాలక సంస్థ కార్యాలయానికి చెందిన స్థలంలో ఆ విగ్రహాన్ని బయటే వదిలేశారు. మళ్లీ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠిస్తామని తొలగించే సమయంలో అధికారులు చెప్పినా సాధ్యపడలేదు. జగన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లీ ఆ విగ్రహాన్ని అదే స్థానంలో నిలబెట్టేందుకు స్థానికులు ముందుకొచ్చారు. 

అధికారుల అనుమతితో మళ్లీ ఆ విగ్రహాన్ని నిలబెట్టేందుకు యత్నిస్తుండటంతో అది ముక్కలైంది. గత ఐదు సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతింది. దీంతో స్థానిక గ్రామస్థులు జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆ ప్రాంతానికి రాకముందు భరతమాత కూడలి అని పిలుచుకునే వాళ్లమని స్థానికులు తెలిపారు. విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించి భరతమాత కూడలి అని నామకరణం చేసే లోపు విగ్రహం ముక్కలవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15లోపు నూతన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.