విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఉత్తమ పాస్‌పోర్ట్ ఆఫీసు అవార్డు - award to Vijayawada RPO - AWARD TO VIJAYAWADA RPO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 27, 2024, 10:16 AM IST
Best Passport Office Award to Vijayawada Regional Passport Office : విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఉత్తమ పాస్‌పోర్ట్ ఆఫీసు అవార్డు రావటం ఆనందంగా ఉందని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి శివ హర్ష హర్షం వ్యక్తం చేశారు. 2023 - 24 ఏడాదికి ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. జూన్ 22 నుంచి 24 వరకు పాస్ పోర్ట్ సేవా దివాస్ నిర్వహించి మెరుగైన సేవలు అందించటంపై చర్చించామన్నారు. రానున్న రోజుల్లో మరింత టెక్నాలజీ తో సేవలు అందిస్తామని వెల్లడించారు.
Award to Vijayawada RPO : 2023-24లో రీజనల్ కార్యాలయ పరిధిలో 3 లక్షల 75 వేల పాస్‌పోర్టులను జారీ చేసినట్లు శివహర్ష తెలిపారు. గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువగా పాస్‌పోర్ట్‌లను ఇక్కడ నుంచి మంజూరు చేశామని తెలిపారు. పాస్‌పోర్ట్ కార్యాలయం విస్తరణ జరుగుతోందని, ప్రస్తుతం 600 మందికి అందిస్తున్న సేవలు పనులు పూర్తయ్యాక 1200కి చేరుతుందని అన్నారు. ప్రస్తుతం పాస్‌పోస్ట్ మేలాలు నిర్వహించాల్సిన అవసరం రావటం లేదని తెలిపారు. తత్కాల్లో రోజుల వ్యవధిలో పాస్ పోర్ట్ తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.