ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు - Bear Attack at Anakapalli - BEAR ATTACK AT ANAKAPALLI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 4:53 PM IST
Bear Attack at Anakapalli: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. జనావాసాలకు అతి సమీపంలోనే సంచరిస్తున్న ఎలుగుబంటి ముగ్గురిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు.
Two Were Died One Women Seriously Injured: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో పనుల కోసం కూర్మారావు, లోకనాథం, లక్ష్మి సావిత్రి తోటకు వెళ్లారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఎలుగుబంటి వీరిపై దాడి చేసింది. ఈ ఘటనలో కూర్మారావు, లోకనాథం సంఘటన స్థలంలోనే మృతి చెందగా లక్ష్మి సావిత్రి తీవ్రంగా గాయపడింది. గతంలో ఎలుగుబంటి (Bear Roars) 3 సార్లు దాడి చేసిందని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు వెల్లడించారు.