బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం- అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు - Balakrishna Wife election campaign - BALAKRISHNA WIFE ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 5:16 PM IST
Balakrishna Wife Vasundhara Election Campaign: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. బాలకృష్ణ తన సొంత డబ్బులతో అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. హిందూపురం ప్రజలకు బాలకృష్ణ చేసిన సేవలను గుర్తుచేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించేందుకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని వసుంధర దేవి కోరారు.
"ఒకప్పుడు హిందూపురం నీటి సమస్యతో అలమటించేది. అప్పట్లో మేం ఎన్నికల ప్రచారానికి వస్తే తమకు నీరు తప్ప ఇంకేమీ అవసరం లేదని ప్రజలు చెప్పారు. అందుకోసమే ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచిన తర్వాత రూ.194 కోట్లు వెచ్చించి గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా హిందూపురం పట్టణానికి తాగునీరందించి అపర భగీరథుడుగా నిలిచారు. పేదలకు రెండు పూటలా భోజనం అందించడానికి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని రద్దుచేసి పేదల నోట్లోని కూడును లాగేసింది. ఇది చూసిన బాలకృష్ణ తన సొంత డబ్బులతో ఎన్టీఆర్ భోజనశాల ఏర్పాటు చేసి ప్రతిరోజు 500 మందికి కేవలం 2రూపాయలకే మధ్యాహ్నం వేళ భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భావించి ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి గ్రామ ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు." - వసుంధర దేవి, బాలకృష్ణ సతీమణి