అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నికల్లో ఓట్ల కోసమే : సీపీఐ నారాయణ - political news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2024/640-480-20561803-thumbnail-16x9-narayana-comments.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 6:03 PM IST
Ayodhya Ram Temple was Built for Votes Narayana Comments : ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసం మాత్రమే అయోధ్యలో రామమందిరం నిర్మించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇండియా కూటమికి భయపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సంకుచిత భావంతో కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు.
BJP is Afraid of India Alliance : దేశంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన ఇండియా కూటమికి బీజేపీ ప్రభుత్వం భయపడుతుందని నారాయణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మన దేశాన్ని ఇండియాకు బదులుగా భారతదేశంగా మార్చేసే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని దూషించారు. అన్ని రాష్ట్రాల్లో శ్రీరాముని అక్షింతలు అంటూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఇది సరైనా పద్ధతి కాదని హెచ్చరించారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో కాంగ్రెస్ విశాల భావంతో ముందుకు వెళ్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.