రిపబ్లిక్ డే రోజు ఆటో డ్రైవర్ విన్నూత ప్రయత్నం - ప్రయాణికుల వద్ద ఒక్క రూపాయి ఛార్జ్ - One Rupee Charge Auto
🎬 Watch Now: Feature Video
Published : Jan 26, 2024, 9:01 PM IST
Auto Driver Charge One Rupee for Republic Day : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై జాతీయ జెండా రూపంలో మూడు రంగుల వరి నారు అమర్చి, ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి ఛార్జీ మాత్రమే తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఈదులపూసపల్లి దర్గా తండాకు చెందిన అంజీ నాయక్ వృత్తిరీత్యా రైతు, ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన ఆటో మీద జాతీయ జెండా తరహాలో వరి నారు అమర్చి, ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి ఛార్జీ మాత్రమే తీసుకున్నాడు.
One Rupee Charge Auto in Mahabubabad : అంతేకాకుండా అంజీ నాయక్ తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికులతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయించాడు. గత పదిహేను సంవత్సరాలుగా ఖాళీ సమయంలో ఆటో నడిపిస్తున్నానని తెలిపాడు. అంజీ నాయక్ ప్రయత్నం బాగుందని పట్టణవాసులు మెచ్చుకున్నారు.