రహదారిపై గుంతలు - దగ్గరుండి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర - Authorities Fill Potholes on Roads - AUTHORITIES FILL POTHOLES ON ROADS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 9:50 PM IST

Authorities Filled Potholes on Roads in MLA Vijay Chandra Orders : మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న జాతీయ రహదారి పైవంతెనను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పరిశీలించారు. నిత్యం వాహనాదారులు ప్రయాణించే రహదారిపై గుంతలు పూడ్చకపోవడంతో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే గుంతలను పూడ్చాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రహదారులను పూడ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అక్కడే ఉండి స్వయంగా గుంతలలో కాంక్రీట్ వేయడంతో పనులను మొదలు పెట్టించారు.  

రహదారి వంతెనపై ఉన్న గుంతలలో ప్రయాణించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు తెలిపారు. ఆర్అండ్​బీ అధికారులు కొన్ని నెలలగా గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకులేదని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు గుంతలలో నీరు చేరి ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల పరిస్థితి గురించి ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు అన్నారు. దశల వారీగా రహదారుల్లో గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ బాధ్యతగా పని చేయాలని ఆయన సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.