విజయవాడలో 'సంస్కృతి-2024'- ఆకట్టుకున్న నృత్య కాళకారుల ప్రదర్శనలు - Cultural Programmes - CULTURAL PROGRAMMES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 6:03 PM IST

Cultural Programmes in Vijayawada : సంస్కృతి, సంప్రదాయాలు, నాటి పద్ధతులు నేటి తరానికి తెలియజేసేలా విజయవాడ క్లబ్‌లో బ్లూమింగ్‌ డేల్ ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆధ్వర్యంలో "సంస్కృతి-2024" పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లూమింగ్‌ డేల్ ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జానపద గీతాలు, కూచిపూడి, జానపద, థింసా నృత్యాలు, కోలాటాలతో విద్యార్థులు అలరించారు. ప్రాచీన యుద్ధ కళలైన కర్ర సాము, కత్తి సాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తప్పెట గుళ్లు, థింసా నృత్య కళాకారుల ప్రదర్శన అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఆనాటి అలవాట్లు ఎలా ఉండేవో విద్యార్థులకు తెలిసేలా వివిధ స్టాల్స్ ఏర్పాటుతో పాటు తోలు బొమ్మలు, చెక్క బొమ్మలు, ఆహార పదార్థాలు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించటం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు నలంద ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూట్ చైర్మన్ విజయబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.