ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం- ప్రభుత్వానికి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లేఖ - ArogyaSri Hospitals Letter - AROGYASRI HOSPITALS LETTER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 10:59 PM IST

ArogyaSri Network Hospitals Letter to Government: రాష్ట్ర వ్యాప్తంగా మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలను నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ వర్గాల ఆస్పత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. గత 6 నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంపై ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో అప్పులపాలయ్యామని ఆసుపత్రి వర్గాలు లేఖలో పేర్కొన్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు నెట్వర్క్ ఆస్పత్రులు లేఖ రాశాయి. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. 

జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారిపోయింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. పాలన ప్రారంభమైన నుంచి ఐదు సంవత్సరాలలో పలుమార్లు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు నిధులు విడుదల చేయకపోవడంతో సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య సేవల జాబితాను పెంచామని ప్రకటించినా ఇప్పటికీ అనేక మందికి సక్రమైన సేవలు అందని దుస్థితి నెలకొంటుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.