నీళ్లలో బస్సు డిపోలు- డ్రైవర్లు, కండక్టర్లు లేక నడవని సర్వీసులు - APSRTC Depots Submerged in Water - APSRTC DEPOTS SUBMERGED IN WATER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 7:22 PM IST
APSRTC Depots Submerged in Water Due to Heavy Rains : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీఎస్ ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. వరదతో విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్ డిపోలు జలమయమయ్యాయి. విద్యాధరపురం డిపోలో 40 బస్సులు, ఇబ్రహీంపట్నం బస్ డిపోలో 20 బస్సులు నీటిలో మునిగాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది కుటుంబంతో సహా వరదలో చిక్కుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు లేక పలు మార్గాల్లో వెళ్లే బస్సులు రద్దయ్యాయి. మరికొన్ని మార్గాల్లో బస్సుల కొరతతో దూరప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కళాశాలలు నీట మునగడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది విద్యార్థులు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే 20 బస్సులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బస్టాండ్‌లో బస్సులు లేక విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. దుర ప్రాంతాలకు వెళ్లే బస్సులు లేక ప్రయాణికులు, సహా వరద బాధితులు అవస్థలు పడుతున్నారు.