జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు - గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి కంచర్ల కోటయ్య రాజీనామా - GOUDA CORPORATION DIRECTOR resigned - GOUDA CORPORATION DIRECTOR RESIGNED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 9:57 PM IST
AP STATE GOUDA CORPORATION DIRECTOR RESIGNED : ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి కంచర్ల కోటయ్య గౌడ్ రాజీనామా చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గౌడ కులస్తులకు ఏటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. దీంతో గీత కార్మికులు తీవ్రంగా కలత చెందారు. నేను వారి జీవితాల్లో మార్పు తీసుకు రావాలని తీవ్రంగా ప్రయత్నం చేశా. కానీ అందుకు తగిన విధంగా ప్రభుత్వం సహకరించలేదు. నాపైన నమ్మకం పెట్టుకున్న మా వర్గానికి న్యాయం చేయనందున నేను ఈ పదవికి అర్హుడను కాదు, అందుకే రాజీనామ చేస్తున్నానని కంచర్ల కోటయ్య తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.
అందులో 672 మంది డైరెక్టర్లుగా నియామకం చేపట్టారు. కానీ ఐదేళ్లు గడిచినా గౌడ కులస్తులకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే ప్రకాశం జిల్లాలోని చీరాల, గిద్దలూరు నియోజకవర్గల్లో ఎక్కువగా బీసీ కులస్తులు ఉంటారు. కానీ గిద్దలూరు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ పదవిని బీసీలకు కాకుండా వేరే సామాజిక వర్గం వారికి కేటాయించడానికి వైఎస్సార్సీపీ నాయకత్వం ప్రయత్నం చేసింది. దీంతో నియోజకవర్గంలో బీసీలందరూ ఏకమై న్యాయపరంగా, ధర్నాలు చేసి చివరికి బీసీ వ్యక్తికే ఛైర్మన్ పదవిని సాధించామని తెలిపారు. ఈ విధంగా పార్టీలో మాకు అడుగడుగునా అన్యాయం జరిగిందని వెల్లడించారు. ఇక వైసీపీలో ఉంటే న్యాయం జరగదని ఆలోచించి ఈరోజు వైఎస్సార్సీపీకి అలాగే ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు కంచర్ల కోటయ్య వెల్లడించారు.