ఉద్యోగులకు 5 రోజుల పని విధానం - మరో ఏడాది పొడిగించిన ప్రభుత్వం - five day work week extended - FIVE DAY WORK WEEK EXTENDED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 9:24 AM IST
Five Day Work Week Extended One Year: రాజధాని అమరావతిలోని సచివాలయం, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 5 రోజుల పని విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పని దినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో సంబంధిత ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ (Chief Secretary Neerabh Kumar Prasad) ఆదేశాలు ఇచ్చారు.