LIVE: వైఎస్ఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 12:02 PM IST

Updated : Jan 29, 2024, 1:20 PM IST

AP PCC Chief YS Sharmila Media Conference Live: అధికార వైఎస్సార్​సీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి వివిధ జిల్లాలో పర్యటనలు చేస్తున్న ఆమె, శనివారం ప్రకాశం జిల్లాలో కార్యకర్తల సమావేశంలో వైఎస్సార్సీపీ​​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ పార్టీకి షర్మిల కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ పార్టీ పేరుకు గతంలో ఉన్న అర్థం వేరని, ఇప్పుడున్న అర్థం వేరంటూ విమర్శించారు. ఇప్పుడున్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్​ అంటే సాయిరెడ్డి, ఆర్​ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమేనని ఆమె అభివర్ణించారు.

ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ప్రజలు ఓటేస్తే సీఎం జగన్‌ ప్రత్యేక హోదాను పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. అనంతపురంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో షర్మిల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హంద్రీనీవా ప్రాజక్టును పూర్తిచేస్తామని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. కాగా ఈ రోజు వైఎస్ఆర్ జిల్లా కడప జయరాజు గార్డెన్స్ లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన రఘువీరారెడ్డి, పల్లంరాజు, జెడి శీలం, గిడుగు రుద్రరాజు, తులసి రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అహ్మదుల్లాలతో పాటు భారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కడపలో షర్మిల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం

Last Updated : Jan 29, 2024, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.