'పోరాటాలు పట్టించుకోలేదు - వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి' - రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-02-2024/640-480-20855394-thumbnail-16x9--ap-panchayat-raj-chamber-president-protest-against-ysrcp-govt.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 8:14 PM IST
AP Panchayat Raj Chamber Fire on YSRCP Govt : గ్రామీణ ప్రజానీకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో (Visakha) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,918 గ్రామాల్లోని మూడు కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకపోగా, స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే సొంత నిధులను, కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం విడుదల చేసేలా వాటిని సొంత అవసరాలకు వినియోగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు (Protest), పోరాటాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.