'రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి'- శ్రీవారి సేవలో కొత్త ఎమ్మెల్యేలు - New MLAs Visit Tirumala - NEW MLAS VISIT TIRUMALA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 12:49 PM IST
New MLAs Visit Tirumala : సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ (జూన్ 6న) వీఐపీ దర్శన విరామ సమయంలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాశ్, దామచర్ల జనార్దన్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలో తిరుపతి ప్రజలకు సమర్థమైన పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి అభివృద్ధిలో నడిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. తమల్ని నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని పేర్కొన్నారు. కూటమి పార్టీకి కలలో కూడా ఊహించని విధంగా విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.