చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం - చంద్రబాబు బెయిల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 7:34 PM IST
AP Govt Approached Supreme on Challenges Chandrababu Bail: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ సవాల్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఈ నెల 29వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 10న చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్), ఇసుక, మద్యం కేసుల్లో హైకోర్టు ఒకేసారి బెయిల్ మంజూరు చేసింది.
చంద్రబాబు రింగ్ రోడ్డు కేసు: 2014 నుంచి 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రభుత్వ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారం మార్చారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, హెరిటేజ్ సంస్థ తదితరులను నిందితులుగా పేర్కొంది.