రిటైరైన ప్రభుత్వ ఉద్యోగి వీడుకోలు కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు- మండిపడిన సూర్యనారయణ - KR Surya Narayana Fire on Police - KR SURYA NARAYANA FIRE ON POLICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 1:53 PM IST

AP Employees Union President KR Surya Narayana Fire on Police Behavior in Srikakulam : ఆంధ్రప్రదేశ్​లో ప్రజా స్వామ్య పాలనలో ఉన్నామా లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అర్ధంకాని పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్​లో నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమావేశం నిర్వహించిన వేదికకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సెల్ ఫోన్ వెలుగుల్లో నిరసన చేపట్టారు. ఎస్సై రావడంతో రోడ్డుపైకి వచ్చిన ఉద్యోగులు, ఛైర్మన్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రామలక్ష్మణ కూడలిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులు పోలీసులకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరికి పదవీ విరమణ ఉద్యోగికి రోడ్డుపైనే సన్మానం చేశారు.

కేఆర్ సూర్య నారాయణ మాట్లాడుతూ, ఎస్సై ఓ రౌడీలా ప్రవర్తించి హోటల్ యాజమాన్యాన్ని బెదిరించారని ఆరోపించారు. ఉద్యోగి నారాయణ రావు పదవీ విరమణ సందర్భంగా ఆయనకు సన్మానం చేయడానికి సభను ఏర్పాటు చేసుకున్నామని, తాము రాజకీయాలకు సంబంధం లేకుండా సమావేశం ఏర్పాటు చేసుకుంటే పోలీసులు అనధికారికంగా అడ్డుకోవడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.