రాయి దాడి ఘటనపై ముఖేష్ కుమార్ మీనా సమీక్ష- దర్యాప్తును వేగం చేయాలని సూచన - AP CEO Mukesh Kumar Meena - AP CEO MUKESH KUMAR MEENA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 7:51 PM IST
Inquires on Stone Attack incident: ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటన పై దర్యాప్తు వేగవంతం చేయాలని ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ సీపీ కాంతి రాణా తాతా, ఐజీ రవిప్రకాశ్ లను పిలిపించుకుని ఘటన వివరాలను ఆయన సమీక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర లో బందోబస్తుఉన్నా రాయితో ఎలా దాడి చేయగలిగారని సీఈఓ ప్రశ్నించారు. ఘటనలో ఇప్పటికే కొందరిని అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసు అధికారులు ఎన్నికల సీఈఓకి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశించారు. ఘటనకు సంబంధించిన పూర్వపరాలు, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు పై వీడియోలు, ఫోటోల ద్వారా ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి విజయవాడ సీపీ ఇచ్చిన నివేదికతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఘటనపై సీఈఓకి ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.