LIVE: మంత్రివర్గ నిర్ణయాలపై మంత్రుల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : 17 hours ago
|Updated : 17 hours ago
AP Cabinet Meeting LIVE : ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చించగా, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు లో ఆమోదం తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదనపైనా చర్చించారు. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చించి ఆమోదించారు. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు వెల్లడిస్తున్నారు.. మీకోసం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : 17 hours ago