అన్నవరం హైవేపై గ్యాస్ ట్యాంకర్ లీక్- క్షణాల్లో ఏం జరిగిందంటే! - Gas Leaked from Lorry Tanker - GAS LEAKED FROM LORRY TANKER
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-05-2024/640-480-21575605-thumbnail-16x9-gas-leak-highway.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2024, 12:19 PM IST
Annavaram National Highway Gas Leaked from Lorry Tanker : కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం వాహనదారులను హడలెత్తించింది. లారీ ట్యాంకరు నుంచి హైడ్రో క్లోరిక్ లిక్విడ్ గ్యాస్ లీక్ అయ్యింది. దానిని పీల్చిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఓ రసాయన పరిశ్రమ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఔషధ కంపెనీకి లిక్విడ్ గ్యాస్‌తో వెళుతున్న ట్యాంకర్‌ను ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది.
ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి హైడ్రో క్లోరిక్ లిక్విడ్ పైపు తెగిపోయి గ్యాస్ బయటకు వ్యాపించింది. దుర్వాసనతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులకు కళ్ల మంటలు, ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఓ ప్రైవేట్ పరిశ్రమకు చెందిన కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తుని-అన్నవరం మధ్య జాతీయ రహదారిపై దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా గంట పాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని లిక్విడ్ గ్యాస్ పై నీళ్లు చల్లడంతో గాఢత తగ్గిపోయింది.