హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలి: శ్రీనివాసనంద సరస్వతి - Srinivasananda Saraswati interview - SRINIVASANANDA SARASWATI INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 3:59 PM IST
Swami Srinivasananda Saraswati Interview: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దేవాలయాలు, అర్చకులపై దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి విమర్శించారు. 300కు పైగా ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారని శ్రీనివాసనంద సరస్వతి మండిపడ్డారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే హిందువులను, హిందూ ధర్మానికి మనుగడ లేకుండా పోతుందని అన్నారు.
ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవని అన్నారు. ఆలయాల్లో రథాలను ధ్వంసం చేశారని, దేవాలయాల భూములను సైతం ఆక్రమించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేసి హిందూ ధర్మాన్ని, ఆలయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలకు హిందువులకు రక్షణ ఉండేదని మళ్లీ అలాంటి ప్రభుత్వం కావాలంటే చంద్రబాబుకు ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆధ్యాత్మిక తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారంటున్న శ్రీనివాసానంద సరస్వతితో ఈటీవీ భారత్ ముఖాముఖి.