LIVE సార్వత్రిక ఎన్నికలపై వివిధ మీడియా, సర్వే సంస్థల అంచనాలపై చర్చ- ప్రత్యక్ష ప్రసారం - AP EXIT POLLS 2024 - AP EXIT POLLS 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 6:29 PM IST

Updated : Jun 1, 2024, 7:58 PM IST

AP Exit Polls Result 2024: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన తరుణంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏడో విడత ఎన్నికల పోలింగ్​ శనివారం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దేశంతో పాటు వివిద రాష్ట్రాల్లో ప్రజానాడిని వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు అంచనా వేశాయి. చివరి దశ ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ అంచనా ఫలితాలు వెలువరించరాదని ఈసీఐ నిషేధించడంతో, ఈ క్షణం వరకు దేశంతో పాటు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఆయా పార్టీలు ఓ అంచనా వచ్చినప్పటికీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ కీలక అంశాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్​లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఏపీ ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. ఈసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూటమి ఆధిక్యం చూపుతుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా కట్టాయి. ఏపీలో ప్రభుత్వం మార్పు ఖాయమన్న సంకేతాలు వెలువరించాయి.
Last Updated : Jun 1, 2024, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.