LIVE: ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు - చర్చా కార్యక్రమం- ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY ELECTION RESULTS 2024 - AP ASSEMBLY ELECTION RESULTS 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 7:59 AM IST

Updated : Jun 4, 2024, 9:17 PM IST

AP ASSEMBLY ELECTION RESULTS 2024: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపుకు సమయం వచ్చింది. దీని కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 3.33 కోట్లమంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది, హోమ్ ఓటింగ్ ద్వారా 26,473 మంది, ఎలక్ట్రానిక్‌ విధానంలో 26,721 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.  ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు చేయగా, ఎంపీ స్థానాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లతో పాటు అసెంబ్లీ స్థానాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు.13 రౌండ్లు మాత్రమే ఉన్న నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడనున్నాయి. 29 రౌండ్లలో జరిగే రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు రాత్రికి తేలనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఈటీవీ భారత్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. 
Last Updated : Jun 4, 2024, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.