ఈటీవీ విశ్వసనీయతకు కితాబిస్తూ సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది: ఆనం - Anam fire on Sakshi media - ANAM FIRE ON SAKSHI MEDIA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 5:48 PM IST
Anam Venkataramana Reddy Angry with Sakshi Media : ఈటీవీ విశ్వసనీయతకు కితాబిస్తూ ఇవాళ సాక్షి దినపత్రిక కూడా మొదటి పేజీలో కథనం ప్రచురించిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈటీవీలో అద్భుత కథనం ఇచ్చారంటూ ఆ ఛానల్ లో వచ్చేవన్నీ నిజాలేనని సాక్షి యాజమాన్యం ఒప్పుకున్నట్లైందన్నారు. వాస్తవాలు చెప్పే ఈటీవీ లాంటి ఛానల్ సాక్షి మీడియా తరహాలో అసత్యాలు ప్రసారం చేయదనే విషయాన్ని భారతీరెడ్డి గ్రహించాలని హితవుపలికారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై న్యాయవాది సునీల్ కుమార్ తో చేసిన ఇంటర్వ్యూ గురించి ఛానల్ లో ప్రసారం చేస్తే తప్పేంటి అని ఆనం ప్రశ్నించారు.
ఈటీవీ, ఈనాడుకి ఎంతో విలువలు ఉన్నాయి. అందుకే ప్రజాలు వాటిని నమ్ముతున్నారని తెలిపారు. ఎప్పుడు చూసినా ఈటీవీ భయపడుతుంది అని మాట్లాడే భారతి రెడ్డి ఒకసారి టీవీలో ప్రసారమయ్యే వార్తలను చూడాలని కోరారు. వాస్తవాలు రాస్తున్న వారు ఎందుకు భయపడుతారని ప్రశ్నించారు. ఇప్పటికైన సాక్షి మీడియా బుద్ధితెచ్చుకొని తప్పుడు రాతలు రాయటం ఆపాలని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.